Sunday, March 28, 2010

నవ్య వార పత్రిక ఇప్పుడు 0nline లో...




నా ఇష్టమైన నవ్య వార పత్రిక ఇప్పుడు అంతర్జాలంలో .....
యుగాది వికృతి నామ సందర్బంగా ఆంధ్రజ్యోతి వారు నవ్య వార పత్రిక ని అందరికి అందుబాటు లో ఉంచారు.
ప్రతి గురువారం కొత్త సంచిక వస్తుంది. ఇందులో కధలు, శీర్షికలు చాలా బాగుంటాయి.
పొద్దు, కౌముది లాంటి వాటి కోవలోకి ఇది కూడా చేరింది. వార పత్రికలు చదివే నాలాంటి వారికి ఇది శుభవార్త అనే చెప్పుకోవాలి.






ఇటువంటి తెలుగు పత్రికలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు.

Friday, November 2, 2007

చందమామ...ఓ చందమామ

చందమామ ను చాలా రోజులతరువాత చూసాను...అదేనండి రోజూ చూసే చందమామ కాదండి పిల్లల పత్రిక చందమామ...
చుసిన వెంటనే మీకో విషయం చెప్పాలని అనుకున్నా..

చందమామ చందా

ఎయిర్ మెయిల్ ద్వారా అన్నిదేశాలకు 12 సంచికలకు రూ:900 (20 $ )
భారత దేశంలొ 12 సంచికలకు రూ: 180

చందా డబ్బు డి.డి కానీ, మని ఆర్డర్ ద్వారా కానీ
Remittances in Favour of
" CHANDAMAMA INDIA LIMITED"

TO address
Subscription Division Chandamama India limited
82, Defence officers Colony
Ekkatuthangal
Chennai - 600032

E mail : subscription@chandamama.org
Web : www.Chandamama.org

నేను చిన్నప్పుడు చందమామ తెగ చదివే వాణ్ణి...అందుకేనెమో తెలుగంటే ఇంత ఇష్టం.
చిన్నపిల్లకు తెలుగు అలవాటు చెయాలంటె దీన్ని తెప్పించుకొండి.

Sunday, October 7, 2007

జోకాను...

ఒక రోజు మా సునీల్ గాడు వచ్చి ఖుషి సినిమా సూపర్ గా ఉందిరా అన్నాడు.
నేను ఆశ్చ్యరంగా నాతో ఎప్పుడోచూసావుగదరా అన్నాను.
అవునురా ఇది పదోసారి ఇది.
వాడి సినిమా పిచ్చికి వళ్ళుమండి
నాకు ఒక్కసారికే అర్ధంఅయిందిరా అన్నాను.
.........
.........

Friday, October 5, 2007

శేఖర్ కమ్ముల గారికి....

మొత్తానికి చూసేసామండి మీ Happy days సినిమా,నా అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పదలుచుకున్నాను.
ఒక్కముక్కలొ చెప్పాలంటే సినిమా కి Entertainment Value ఉంది.ఉన్న రెండున్నర గoటలు time pass ఐపొతుంది.సినిమా ని మూడుముక్కల్లొ చెప్పాలంటె...College లో Ragging, Seniors Juniors గొడవలు, Love.

శేఖర్ కమ్ముల సినిమా అంటె సహజత్వానికి దగ్గరగా ఉండె సినిమా అనుకున్నాను,కాని కొంచం Disappoint అయ్యాను. 8th to 10th చదువుతున్న పిల్లలు ఈ సినిమా చూసారంటె Professional college అంటె Love , Girlfriend చాలా common అని ఫీల్ అవుతారు. అన్ని సినిమాలు ఎలాగో దీన్నే చూపిస్తున్నయి, కాని శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు దీన్నే చూపించటం అంతగా నచ్చలేదు.

సినిమా లొ నలుగురు Friends, వారికి correct గా నలుగురు అమ్మాయిలు friends . Pairing తప్పనిసరేమో. సినిమాలొ ఎక్కడా కెరీర్ గురించి serious గా తీసుకున్నట్టు అనిపించదు. ఈ మధ్యనే Engineering colleges కి Admissions జరిగాయి. ఎంత సినిమా అయినా కొంతమంది అయినా ఈ ఊహలతొ college Enter అవుతారెమో...

ఈ సినిమాలొ నాకు నచ్చింది
టైసన్...చాలా casual ఉండి అందరూ like చెసే friendly character,
రాజేశ్...ప్రొద్దుటూరు MLA కొడుకు ( సినిమాలొ )worth to watch his comedy
ఇందు...heroine, looks beautiful
చందూ...hero..he is Ok , but not as a hero.


Finally, its a watchful movie, but not as much of his previous movies.



Note: మీరు శేఖర్ కమ్ముల కి గాని, ఈ సినిమా కి గాని విసనకర్రలైతె నన్ను ఈ భ్లొగ్ ని లైట్ తీసుకోండి.

Friday, September 7, 2007

ఓర్కుట్ తెలుగు లో...







నాకు ఆనందంగా ఉంది..ఓర్కుట్ ఇప్పుడు మన భారతీయ భాషలలొ...ముఖ్యంగా తెలుగు లో..
(తెలుగా మజాకా మరి)

Tuesday, September 4, 2007

పాత పాటలు కావాలంటే......


పాతబంగారం....నిజంగానే పాతపాటలంటే బంగారంతొ సమానం
ఎన్నో సుమధురమైన పాటలు ఈ WEB SITE లొ పొందుపరచబడి ఉన్నాయి
గుణ సుందరి కధ (1949),
మాలపిల్ల ( 1938 ),
మిస్సమ్మ,
గుండమ్మగారి కధ,
మల్లీశ్వరి,
లాంటి ఎన్నొ చిత్రరాజాల పాటలు ఉన్నయి ఇందులొ

అంతే కాకుండా ఘంటసాల మాస్టారి పాటలు, ఇళయరాజా పాటలు,
బాలు పాటలు, మరియు భక్తి పాటలు, అన్నమాచార్య కీర్తనలు లాంటివి ఎన్నొ ఉన్నవి
http://pathabangaram.com/forums/index.php

కాకపొతె మీరు పాటలు దిగుమతి చేసుకోవాలంటే ఉచిత సభ్యత్వం నమొదు చేసుకోవాలి

Wednesday, August 22, 2007

ఇదండీ సంగతి

అత్యంత ధనిక బోర్డ్ ఐన భారత క్రికెట్ సంఘానికి సొంత వెబ్ సైట్ లేదు
మొన్నటి వరకు క్రికెట్ సంఘానికి సొంత భవనం లేదు.....అన్ని సమావేశాలు ఐదు నక్షత్రాల వసతి సముదాయం లోనే...
కోశాధికారి శ్రీనివాస్ తన కార్యకలాపాల నిర్వహణ చెన్నై నుంచే...
అధ్యక్షుడు శరద్ పవార్ పూర్తి కాలపు రాజకీయాలే...
సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి దిగ్గజాలు ఉన్న క్రికెట్ టీం ని నియంత్రించే BCCI నిర్వాకం ఇది...

పూర్తి సమాచారం కొరకు...
http://www.eenadu.net/specialpages/sp-champmain.asp?qry=sp-champ1

ఇదండీ మన BCCI పరిస్థితి.