Thursday, April 26, 2007

గ్రీన్ కార్డ్


ఇది మీరు అనుకునే గ్రీన్ కార్డ్ కాదండోయ్..వేరేది. పొద్దున న్యూస్ పేపర్ తిరగేస్తుంటే మన MPల పాస్ పోర్ట్ ల గొడవ కంటపడింది.ఎందుకో మరి నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. మా పాఠశాల లో పరీక్ష ల ముందు ఒక పద్ధతి ఉండేది. విద్యార్దులంతా అన్ని పాఠాల ప్రశ్నలు ఒప్పచెప్పాలి. అలాచెప్పిన తరువాత మా మాష్టారు ఒక్కొక subject కి ఒక కార్డ్ లొ సంతకం చేస్తారు. ఆ కార్డే గ్రీన్ కార్డ్ . ఆ కార్డ్ వచ్చింది అంటే కాలర్ యెగరేసుకొని తిరిగేవాళ్ళం .కాకపోతే ఇందులొ ఒక కిటుకు ఉంది . ముందు మా టాపర్ సార్ కి అప్పచెప్పెవాడు. మాష్టారు కొంత మంది నమ్మకం ఐన విద్యార్దులను టాపర్ కి అప్పచెప్పమ నే వాళ్ళు . ఇంకేం మాపని చకచకా కానిచ్చేవాళ్ళం. కానీ మేము నిజాయితీ గా చేసేవాళ్ళం , ఎప్పుడో ఒకసారి మాత్రం కొంచం అవకాశం తీసుకోనేవాళ్ళం. పాపం కొంత మంది మాత్రం బలయ్యేవాళ్ళు

No comments:

Post a Comment